క్రీడాకారులకు బహుమతులు పంపిణీ
కోవూరు మండలంలోని గంగవరం గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన విజేతలకు శుక్రవారం బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నేత గూడూరు శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.