చిత్తూరు జిల్లా కుప్పం పట్టణంలో నిర్వహిస్తున్న చేపల మార్కెట్, మాంసం దుకాణాలను కుప్పం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చేపల దుకాణాల్లో నాణ్యమైన చేపలను విక్రయించాలని సూచించారు. అదే విధంగా తాజా చికెన్, మటన్ విక్రయాలు చేయాలని, నాసిరకం చికెన్, మటన్ అమ్మితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ హెచ్చరించారు.