తుఫాను నేపథ్యంలో నగిరి నియోజకవర్గానికి సంబంధించి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఇన్ చార్జ్ కలెక్టర్ విద్యాధరి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలకు ఎవరికైనా తుఫాను వల్ల ఇబ్బంది కలిగినట్లయితే వెంటనే నగిరి ఆర్డిఓ కార్యాలయంలోని 9652138325 ను సంప్రదించాలని తెలియజేశారు. తుఫాను పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారి తెలిపారు.