పుత్తూరు: సీసీ రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

80చూసినవారు
చిత్తూరు జిల్లా, నగిరి నియోజకవర్గం, పుత్తూరు రూరల్ మండలం , తడుకు గ్రామపంచాయతీ ఎగువగూళూరులో నియోజకవర్గ ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ శనివారం సీసీ రోడ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. మహిళలు సంక్రాంతి శోభ ఉట్టిపడే విధంగా ముగ్గులతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్