పుత్తూరు మండలం చంద్రప్ప నాయుడు కండ్రిగలో ప్రజలకు పాముల బెడద తప్పడం లేదు. శుక్రవారం గ్రామంలో ఓ ఇంటి పైభాగంలో ఎలుకల కోసం వచ్చిన ఓ పాము హాల్ చల్ చేసింది. స్థానికులు స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇవ్వడంతో, ఈ సమాచారం అందుకున్న
స్నేక్ క్యాచర్ గ్రామానికి వచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలివేశారు. గత కొన్ని రోజులుగా పుత్తూరు పరిసర ప్రాంతాలలో పలు రకాల పాములు హాల్ చల్ చేస్తున్నాయని స్థానికులు వాపోయారు.