రాసనపల్లిలో సారా ఊట ధ్వంసం

82చూసినవారు
రాసనపల్లిలో సారా ఊట ధ్వంసం
గుడిపాల మండలం రాసనపల్లి అటవీ ప్రాంతంలో వెయ్యి లీటర్ల సారా ఊటను ధ్వంసం చేసినట్లు గుడిపాల ఎస్సై రామ్మోహన్ తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఆదివారం అక్రమ నాటు సారా, కర్ణాటక మద్యం, గంజాయి తదితర అసాంఘిక కార్యకలాపాలకు చెక్ పెట్టేందుకు దాడులు నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా రాసన పల్లి అటవీ ప్రాంతంలో తన సిబ్బందితో తనిఖీ చేసినట్లు చెప్పారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్