వడమాలపేట: విద్యుత్ షాక్ తో రైతు మృతి

80చూసినవారు
వడమాలపేట: విద్యుత్ షాక్ తో రైతు మృతి
నగిరి నియోజకవర్గం, వడమాలపేట మండలం కల్లూరు చెరువు సాగునీటి సంఘం అధ్యక్షుడు రఘురామయ్య కరెంట్ షాక్ తో బుధవారం మృతి చెందారు. పొలం వద్ద మోటార్ వేయడానికి వెళ్లి కరెంటు షాక్ కు గురై అక్కడికక్కడే మరణించారు. రైతు మృతి పట్ల నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తన సంతాపం తెలియజేశారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు తెలుగుదేశం పార్టీ నాయకులు మృతదేహన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

సంబంధిత పోస్ట్