నారాయణ మెడికల్ కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య

1532చూసినవారు
నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో బీడీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న ప్రదీప్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐదవ ఫ్లోర్ నుంచి దూకడంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా మంగళవారం వెలుగులోకి వచ్చింది. గాయపడిన ప్రదీప్ ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వైద్య విద్యార్థి మృతి చెందాడు. దీనిపై తల్లిదండ్రులు రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్