కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో కృత్రిమ అవయవాల తయారీ సంస్థ ఏఎల్ఐఎంసిఓ ఆధ్వర్యంలో దివ్యాంగులకు సహాయ పరికరాల పంపిణీ కార్యక్రమాన్ని పలమనేరు బాలికోన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, నియోజకవర్గం వ్యాప్తంగా వచ్చిన దివ్యాంగులకు సహాయ పరికరాలు, సైకిళ్లను తన చేతుల మీదుగా అందించారు.