పలమనేరులో 2002లో పోలీసులు మైత్రి పోలీస్ పార్క్ నిర్మించారు. కాలక్రమేణా తరువాత వచ్చిన అధికారులు దానిని పట్టించుకోకపోతే కొంత మంది ఆకతాయిల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారింది. దీనిపై పలువురు అసహనం వ్యక్తం చేయడంతో పోలీసులు పలమనేరు పరిరక్షణ సమితి సహకారంతో పార్క్ ను పున: నిర్మించారు. దీంతో పలువురు ఆదివారం సంతోషం వ్యక్తం చేశారు.