వినాయక మండపాల వద్ద ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని గుడ్లూరు సర్కిల్ సిఐ మంగారావు అన్నారు. గురువారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ. వినాయక చవితి ఉత్సవాలకు తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. నిర్వాహకులు ఆన్లైన్లో అప్లై చేసి అనుమతులు పొందాలని సూచించారు. వినాయక మండపాలపై పోలీసుల పర్యవేక్షణ ఉంటుందని, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటే నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామన్నారు.