పూతలపట్టు: ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్
పూతలపట్టు మండలంలోని నాగిరెడ్డిపల్లిలో మంగళవారం ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్ ప్రవీణ నిర్వహించారు. 180 మంది రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు మాత్రలు పంపిణీ చేశారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం ఇంటి వద్దకే వైద్య సేవలు అందిస్తోందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హై రిస్క్ గర్భవతులను గుర్తించి వారికి సలహాలు సూచనలు ఇచ్చారు.