రొంపిచర్లలోని ఓ ప్రైవేట్ స్కూలు వార్షికోత్సవంలో చిన్నారులు ప్రదర్శించిన డాన్సులు అందరిని ఎంతగానో అలరించాయి. స్కూల్ 11వ వార్షికోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో కిరణ్ కుమార్, ఎంఈఓ శ్రీనివాసులు, ఛైర్మన్ చంద్రశేఖర్ ఇతర అధికారులు పాల్గొని ప్రదర్శనను తిలకించారు. విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పెద్ద ఎత్తున తరలి రావడంతో అక్కడ సందడి వాతావరణం నెలకొంది.