గానుగచింత గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును పుంగనూరు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ చల్లా రామచంద్రార రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాడి పరిశ్రమపై టీడీపీ కూటమి ప్రభుత్వం దృష్టి సారించిందని అన్నారు. వీటి నిర్మా ణం కోసం పశుపోషకులకు 90 శాతం రాయితీ ఇస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కృష్ణం నాయుడు, మధు నాయుడు, శేషాద్రి నాయుడు, అమర్నాథరెడ్డి , వెంకటరమణనాయుడు ఉన్నారు.