పుంగనూరు: స్వామివారి భక్తుల మరణం బాధాకరం: రామచంద్ర యాదవ్

67చూసినవారు
పుంగనూరు: స్వామివారి భక్తుల మరణం బాధాకరం: రామచంద్ర యాదవ్
తిరుమల స్వామివారి వైకుంఠ ద్వార దర్శనం కోసం వచ్చిన భక్తుల తోపులాట, తొక్కిసలాట కారణంగా ఆరుగురు భక్తులు మరణించడం అత్యంత బాధాకరమైన విషయమని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన గురువారం పుంగనూరు పట్టణంలో మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. స్వామివారి దర్శనం కోసం లక్షలాదిగా భక్తులు వస్తారని అంచనా ఉన్నప్పటికీ పాలకమండలి నిర్లక్ష్యంగా ఉండటం తగదన్నారు.

సంబంధిత పోస్ట్