పుంగనూరు నియోజకవర్గంలోని బూరగ మంద,ఆవులపల్లి, పుంగనూరు పట్టణంలోని కళ్యాణ వెంకటేశ్వరస్వామి ఆలయాలలో వైకుంఠ ఏకాదశికి సంబంధించిన ఏర్పాట్లను టీటీడీ సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్ మంగళవారం పరిశీలించారు. ఆలయానికి వచ్చిన ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. తర్వాత ఏర్పాట్ల పై ఆలయ ఇన్‌స్పెక్టర్ మునీంద్ర బాబును అడిగి తెలుసుకున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చూడాలన్నారు.