పుంగనూరు నియోజకవర్గం రొంపిచర్ల మండలంలోని బొమ్మయ్య గారి పల్లి ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న జాఫర్ బాషా జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం ఈ అవార్డును చిత్తూరులో విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి జాఫర్ తీసుకున్నారు. ఉత్తమ ఉపాధ్యా యుడిగా అవార్డు తీసుకున్న ఆయన ను పాఠశాల ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు.