వెంకటాచలం: గిరిజనుల సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక గ్రీవెన్స్
వెంకటాచలం మండలం చెముడుగుంట సమీపంలోని శ్రీడ్స్ కల్యాణ మండపంలో గిరిజనుల ప్రత్యేక ప్రజా విజ్ఞాపనల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ సూర్య తేజ, జిల్లా, మండలస్థాయి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. గిరిజనుల అర్జీలు ఆన్ లైన్ నమోదు కోసం 15 ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు.