సర్వేపల్లి: ఇరిగేషన్ శాఖ అవినీతిపై విచారణ జరపాలి
సర్వేపల్లి నియోజకవర్గంలోని ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న అవినీతిపై జిల్లా కలెక్టర్ వెంటనే విచారణ చేపట్టాలని జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం మాజీ మంత్రి బ్రహ్మ దేవం గ్రామంలో అనారోగ్యానికిగురైన పట్టపు కృష్ణయ్య ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమిరెడ్డి అవినీతి రోజురోజుకు పెరిగిపోతుందని తెలిపారు.