చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ ఉద్యోగులకు మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్లను పంపిణీ చేయనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ షణ్మోహన్ తెలిపారు. జిల్లాలోని ఎన్నికల విధులకు హాజరవుతున్న 12 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మే 3 నుంచి పోస్టల్ బ్యాలెట్ అందజేస్తామని అన్నారు.ఈ నెల 21 నుంచి విభిన్న ప్రతిభావంతులు, 85 ఏళ్లు నిండిన వారు ఇంటి వద్దే ఓటు వేసే ప్రక్రియకు బీఎల్ఓలు సర్వే చేస్తారని పేర్కొన్నారు.