కేవీబీపురం మండలం మారప్పరెడ్డి కండ్రిగ చెక్ పోస్ట్ వద్ద భారీ కొండచిలువ మంగళవారం రాత్రి రోడ్డు పై అడ్డంగా పడుకుంది. అది ఎంతసేపటికి కదలకపోవడంతో స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారి భోగరాజు, రఘుపతి కొండచిలువను పట్టుకొన్నారు. అనంతరం సమీప ప్రాంతంలో ఉన్న అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలినట్లు చెప్పారు. కొండచిలువ సుమారు 20 కేజీల బరువు ఉంటుందని అటవీశాఖ అధికారులు తెలిపారు.