సత్యవేడు నియోజకవర్గం కేవీబీ. పురం మండలం కలత్తూరులో సోమవారం రాత్రి ఉద్రిక్తత నెలకొంది. సాగు భూమిలో ప్రవేశించకుండా రేంజర్ అడ్డగిస్తున్నారంటూ దళిత రైతులు ఆత్మహత్యకు సిద్ధపడ్డారు. అధికారుల ఎదుట ఐదు మంది మహిళా రైతులు ఆత్మహత్య చేసుకోవడానికి పెట్రోల్ పోసుకున్నారు. దీంతో పోలీసులు అప్రమత్తమై నివారించారు. దళిత రైతులకు న్యాయం జరిగేంత వరకు ఈ పోరాటం ఆగదని అవసరమైతే ప్రాణత్యాగం చేస్తామని రైతులు తెలిపారు.