నాగలాపురం: 10 ట్రాక్టర్లకు జరిమానా

52చూసినవారు
సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం అరుణానది పరివాహక ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తూ పట్టుబడిన ట్రాక్టర్లకు జరిమానా విధించినట్లు శనివారం నాగలాపురం ఇన్చార్జ్ తహశీల్దార్ లావణ్య పేర్కొన్నారు. పట్టుబడిన 11 ట్రాక్టర్లలో ఒక ట్రాక్టర్కు ప్రభుత్వ సంబంధిత నిర్మాణాలకు అనుమతులు ఉన్నాయి. దీంతో మిగిలిన 10 ట్రాక్టర్లకు ఒక్కొక్క ట్రాక్టర్కి రూ. 5 వేలు చొప్పున రూ. 50 వేలు జరిమానా విధించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్