నాగలాపురం మండలంలోని సురుటుపల్లి శ్రీ పల్లికొండేశ్వరస్వామి దేవస్థానం నందు కుంభాభిషేకం జరిగి ఆరు సంవత్సరాల పూర్తికావడంతో 6వ సంవత్సర అభిషేకం కార్యక్రమం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. చెన్నైకి చెందిన చంద్రశేఖర్ గురుక్కల్ వారి శిష్య బృందంతో ఉదయం విఘ్నేశ్వర పూజ, పూర్ణాహుతి, కలశాభిషేకం, రుద్ర త్రిశక్తి అర్చనలు నిర్వహించారు. మధ్యాహ్నం మహాదీపారాధన కార్యక్రమం అనంతరం భక్తులకు ప్రసాదం వినియోగం చేశారు.