నాగలాపురం: శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో భక్తుల రద్దీ

82చూసినవారు
ఆంగ్ల నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం నాగలాపురంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన శ్రీ వేదవల్లి సమేత శ్రీ వేదనారాయణస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. మత్స్యావతార మూర్తి శ్రీ వేదనారాయణస్వామివారిని, శ్రీ వేదవల్లి అమ్మవారిని భక్తులు దర్శించుకున్నారు. ధ్వజస్తంభం వద్ద భక్తులు నేతి దీపాలు వెలిగించి, కర్పూర హారతులు ఇచ్చి సూర్య భగవానునికి ప్రీతిపాత్రమైన మత్యావతారునికి మొక్కులు సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్