సత్యవేడు నియోజకవర్గం నారాయణవనం అరణ్యం కండిగ పంచాయతీలోని కైలాస కోనకు నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పర్యాటకులు, భక్తులు భారీగా తరలివచ్చారు. కైలాస కోన జలపాతంలో పవిత్ర పుణ్యస్నానాలు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కైలాసనాథ స్వామిని దర్శించుకున్నారు. కొందరు భక్తులు తలనీలాలు సమర్పించారు. ఆలయ ఈవో కృష్ణా నాయక్ పర్యాటకులకు కావలసిన అన్ని ఏర్పాట్లు చేశారు.