స్వర్ణాంధ్ర 2047కు సంబంధించి ప్రతి పంచాయతీ పరిధిలోని గ్రామ సభలు నిర్వహించి తగిన ప్రణాళికలను సిద్ధం చేయాలని సత్యవేడు ఎంపీడీవో చంద్రశేఖర్ కోరారు. గురువారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, అసిస్టెంట్ ఇంజనీర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అన్ని పంచాయతీల్లోనూ రెండు రోజుల్లో గ్రామ సభలు జరిపి స్వర్ణాంధ్ర ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.