శ్రీకాళహస్తిలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. రామసేతు వంతెన సమీపంలోని సూపర్ బజారు వద్ద ఉన్న ఓ హోటల్ కిచెన్లో మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది మంటలు అర్పి వేశారు. ఒకే బిల్డింగ్లో ఓ సూపర్ మార్కెట్, లాడ్జి, బ్యాంక్ ఉంది. మంటలు అదుపులోకి రావడంతో వారంతా ఊపిరిపీల్చుకున్నారు. ఎటువంటి నష్టం జరగలేదు. మంటలు అదుపులోకి రాకుంటే ఊహించని భారీ నష్టం జరిగేదని అందరూ భావించారు.