శ్రీకాళహస్తీశ్వర దేవస్థాన ఆలయ పరిపాలన భవనం వద్ద గురువారం 78వ స్వతంత్ర వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా భారత్ మాత చిత్రపటానికి వేద పండితులు వేదమంత్రాలతో పుష్పాలతో పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి హారతి సమర్పించారు. అనంతరం నేషనల్ ఫ్లాగ్ జెండాను ఈవో మూర్తి ఎగరవేశారు కార్యక్రమంలో సి ఆర్ఎస్ పోలీసులు మరియు దేవస్థాన అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున్ ఏఈఓ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.