శ్రీకాళహస్తి పట్టణంలోని గ్రంథాలయంలో మంగళవారం విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. వన్ టౌన్ మహిళా కానిస్టేబుళ్లు మౌనిక విద్యార్థులకు చట్టాల గురించి వివరించారు. ప్రతి ఒక్కరు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, సోషల్ మీడియాకు దూరంగా ఉండాలని చెప్పారు. విద్యార్థినులు చదువుపై శ్రద్ధ వహించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరారు.