శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి వి. గోపాలకృష్ణారావు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు. శ్రీ మృత్యుంజయ స్వామి సన్నిధానం వద్ద కార్యనిర్వహణాధికారి టి. బాపిరెడ్డి శేష వస్త్రంతో ఘనంగా సత్కరించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు.