సూళ్లూరుపేట నియోజకవర్గం నాయుడుపేట శివాలయం వద్ద మంగళవారం అయ్యప్ప మకర జ్యోతి దర్శనాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తారక ప్రభు అయ్యప్ప సేవా సంఘం వ్యవస్థాపకుడు కోటకొండ గజేంద్ర ఆధ్వర్యంలో గురుస్వాములు మకరజ్యోతి ఏర్పాటు చేశారు. శబరిమలై కొండల్లో అయ్యప్ప జ్యోతి దర్శనం జరిగిన సమయంలోనే కర్పూర జ్యోతి వెలిగించి పూజలు నిర్వహించారు. గురుస్వామి పద్మనాభం, చెంచయ్య మొదలియార్ గురుస్వాములు పూజలు చేశారు.