సూళ్లూరుపేట: యువత చదువులతో పాటు క్రీడల్లో మరింత రాణించాలి

56చూసినవారు
యువత క్రీడల్లో రాణించాలని నాయుడుపేట పట్టణ సీఐ బాబీ అన్నారు. మండల పరిధిలోని గొట్టిప్రోలు గ్రామంలో 3 రోజుల నుంచి జరుగుతున్న జిల్లా స్థాయి బహిరంగ కబడ్డీ పోటీలకు ఆదివారం సీఐ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులను పరిచయం చేసుకొని శుభాకాంక్షలు తెలియజేశారు. సీఐ మాట్లాడుతూ యువత చదువులతో పాటు క్రీడా రంగంలో మరింత రాణించాలన్నారు. కార్యక్రమంలో నెల్లూరు వీఆర్ సీఐ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్