మూడవసారి భారీ మెజారిటీతో మా నాన్నను, మీ ఇంటి బిడ్డను గెలిపించాలని సూళ్లూరుపేట వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కిలివేటి. సంజీవయ్య కుమార్తె సౌజన్య కోరారు. సోమవారం నాడు సూళ్లూరుపేట పట్టణంలో 21 వార్డు కౌన్సిలర్ విజయలక్ష్మి తో కలిసి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. 13వ తేదీన ఫ్యాన్ గుర్తు పై ఓటు వేసి సంజీవయ్యను, ఎంపీ గా పోటీ చేస్తున్న గురుమూర్తి ని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో దబ్బల. శ్రీమంత్ రెడ్డి ఉన్నారు.