నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామం లోని ఎస్టీ కాలనీలో సోమవారం పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది. తర్వాత పెన్షన్ తీసుకున్న లబ్ధిదారులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. 3000 పెన్షన్ పెంచుతామంటే జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసామని, కానీ సంవత్సరానికి రూ. 250 చొప్పున పెంచుతాడని కలలో కూడా ఊహించలేదన్నారు. ఒకేసారి చంద్రబాబు రూ. 7000 ఇవ్వడం జీవితంలో మర్చిపోలేమన్నారు.