సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి: మాజీ ఎమ్మెల్యే మేకపాటి
నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉదయగిరి, ఆత్మకూరు నియోజకవర్గ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆయన సతీమణి టిడిపి రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రెటరీ మేకపాటి శాంతి కుమారి సూచనలు చేశారు. తుఫాను సమయంలో తీవ్రమైన పెనుగాలులు వీచే అవకాశం, పిడుగులు పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా వుండి అవసరమైతే తప్ప బయటకి వెళ్లకుండా, సురక్షిత ప్రాంతాల్లో ఉండాలన్నారు.