నెల్లూరు జిల్లాలో మోస్తారు వర్షం

50చూసినవారు
నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, సీతారాంపురం, దుత్తలూరు, మర్రిపాడు మండలాల్లోని కొన్ని గ్రామాల్లో గురువారం రాత్రి సమయంలో సుమారు అరగంటసేపు మోస్తారు వర్షం కురిసింది. ఉదయం నుంచి తీవ్రంగా ఎండ ఉండి సాయంత్రం సమయంలో ఆకాశంలో స్వల్ప మార్పులు చోటుచేసుకుని వర్షం కురవ సాగింది. కాగా గత నాలుగు, ఐదు రోజుల నుంచి నెల్లూరు జిల్లా ప్రజలు తీవ్ర ఎండలతో సతమతమవుతున్నారు. ఈ వర్షం కాస్త ఉపశమనం కలిగించిందని చెప్పవచ్చు.

సంబంధిత పోస్ట్