డక్కిలి మండలం మాటుమడుగులో గురువారం మాజీ ఎంపీపీ పోలంరెడ్డి వెంకటరెడ్డి అంత్యక్రియలు జరిగాయి. తెదేపా ఆవిర్భావం నుంచి పార్టీలో ఉన్నందుకు ఆయన పార్థివ దేహంపై తెదేపా జెండాను కప్పి పార్టీ తరఫున సంతాపం పాటించారు. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, తెదేపా జాతీయ ఉపాధ్యక్షుడు వెంపటి మాధవనాయుడు కొద్ది దూరం వెంకటరెడ్డి పాడె మోసి కుటుంబీకులకు సానుభూతి తెలియజేసారు. అనంతరం అంతిమ యాత్రలో పాల్గొన్నారు.