డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం అమలు ఒక బృహత్తర కార్యక్రమం అని ఈ మహోన్నత కార్యక్రమం ద్వారా వారు ఆరోగ్యంగా ఉంటూ చదువుపై దృష్టి పెట్టి చదవగలరని తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, వెంకటగిరి ఎమ్మెల్యే కొరుగొండ్ల రామకృష్ణ సంయుక్తంగా అన్నారు. శనివారం వెంకటగిరి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కలెక్టర్, ఎమ్మెల్యే, అధికారులతో కలిసి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని కళాశాలలో ప్రారంభించారు.