తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలో గత కొద్దిరోజులుగా ఎండతీవ్రతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 2. 30 గంటల సమయంలో పట్టణంలో ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో పట్టణంలో రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయి వాహనదారులు, పాదచారులు, వ్యాపారస్తులు ఇబ్బందులు పడ్డారు.