వెంకటగిరి నియోజకవర్గం సైదాపురం మండలంలోని స్థానిక ఆరోగ్య కేంద్రం వద్ద మంగళవారం ఆశా, ఆరోగ్య సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డా. నిత్య ప్రశాంతి మాట్లాడుతూ. ప్రస్తుతం గ్రామాల్లో డెంగీ, మలేరియా, విష జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా హ్యుమాన్ మెటా న్యూమో వైరస్ కలవరపాటు చేస్తుందని, భయపడకుండా జాగ్రత్త వహించాలని సూచనలు చేశారు.