ఏపీలో విషాదం.. విద్యార్థిని అనుమానాస్పద మృతి

54చూసినవారు
ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. అనంతపురంలోని తేజ్ జూనియర్ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. కాలేజీ యాజమాన్యం వేధింపుల వల్లే విద్యార్థిని ఉరేసుకుని మృతి చెందిందని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్‌లో బాధితులతో కాలేజీ యాజమాన్యం సెటిల్మెంట్ చేసేందుకు ప్రయత్నిస్తుందని సమాచారం. మృతురాలు ఉరవకొండ మండలం, పాల్తూరు గ్రామానికి చెందిన చిన్న తిప్పమ్మగా గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్