అల్లూరి జిల్లా చింతూరు ఏజెన్సీలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సీలేరు జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. డొంకరాయి, ఫోర్ బే డ్యామ్‌ల 15 గేట్లు ఎత్తి లక్షా పది వేల క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. సీలేరు వరదకు శబరి నదిలో నీటి మట్టం పెరుగుతుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.