భద్రతా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి

70చూసినవారు
భద్రతా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
భద్రతా చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు సదస్సులు నిర్వహించాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశించారు. రామభద్రపురం పోలీస్ స్టేషన్ ను గురువారం ఆకస్మికంగా సందర్శించారు. నేరాల నియంత్రణకు గస్తీ, పెట్రోలింగ్ ముమ్మరం చేయాలన్నారు. పోలీసుశాఖ ప్రతిష్ట పెంచే విధంగా సిబ్బంది ప్రవర్తన ఉండాలన్నారు. విజిబుల్ పోలీసింగ్, ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాలు అమలు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్