జిల్లాలోగంజాయి అక్రమ రవాణా నియంత్రణకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ ఆదివారం తెలిపారు. గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి అన్నిరకాల కఠిన చర్యలు చేపడతామన్నారు. ఇతర రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చే అన్ని రహదారులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వాహన తనిఖీలు ఒకే ప్రదేశం కాకుండా వేరు వేరు చోట్ల నిర్వహించాలన్నారు