మెరకముడిదాం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం కురిసిన కుండపోత వర్షానికి చినరవ్యాం రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. చినబంటుపల్లి చెల్లాపురం రోడ్డు నుండి చినరవ్యాం వెళ్లే రోడ్డు కు అనుకుని సర్వాజీ మైన్ బంటా ఉండడంతో రోడ్డు కోతకు గురైంది దీంతో ఈ రోడ్డుపై ప్రయాణం ప్రాణాపాయంగా మారింది. గతంలో ఈ విషయమై అనేక పర్యాయాలు ఉన్నత అధికారులకు, నేతలకు ఫిర్యాదు చేసిన ఎటువంటి ఫలితం లేకపోయింది అని వీరు వాపోతున్నారు.