ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల ఇన్ చార్జి గా కె. కోటపాడు మండలం మేడ్చల్ గ్రామానికి చెందిన మల్లువలస సూర్యనారాయణను నియమించినట్లు ఆ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరి నాయుడు శుక్రవారం తెలిపారు. జాతీయ డైరెక్టర్ ఆదేశాల మేరకు సూర్యనారాయణకు నియామక పత్రం తో పాటు ఐడెంటి కార్డును అందజేశారు. తనకు అప్పగించిన పనిని అంకితభావంతో నిర్వహిస్తానని సూర్యనారాయణ తెలిపారు.