సామాజిక ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ

79చూసినవారు
గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వాసుపత్రిని శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్యాధికారులతో సమావేశం అయ్యారు. ఆసుపత్రిలోని ల్యాబ్, శస్త్రచికిత్సలు గదులను పరిశీలించారు. రోగులతో కొద్దిసేపు ముచ్చటించారు. రేడియాలజిస్ట్ లేకపోవడంతో స్కానింగ్ లకు ఇబ్బందులు పడుతున్నట్లు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. సూపరిండెంట్ జగదీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్