గంట్యాడ నూతన ఎస్. ఐ గా డి. సాయి కృష్ణ గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో పనిచేస్తున్న ఆయన బదిలీపై గంట్యాడ ఎస్. ఐగా నియమితులయ్యారు. ఈ మేరకు సాయి కృష్ణ బాధ్యతలు చేపట్టారు. ఇంతవరకు పనిచేసిన ఎస్. ఐ సురేంద్రనాయుడు ఎస్ బి కి బదిలీ అయ్యారు.