శాసనాపల్లి: పారిశుధ్య కార్మికులకు సన్మానం..

63చూసినవారు
శాసనాపల్లి: పారిశుధ్య కార్మికులకు సన్మానం..
జామి మండలం శాసనాపల్లి లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్మికులకు సర్పంచ్ బసవ వెంకటప్పారావు సన్మానం చేశారు. గ్రామస్థుల ఆరోగ్య పరిరక్షణలో పారిశుధ్య కార్మికులు కీలకపాత్ర పోషిస్తున్నారని, సన్మానానికి అర్హులని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్